Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సీమరాజా'లో సిమ్రన్ విలనిజం చూసితీరవలసిందే: నిర్మాత సాయికృష్ణ

  • తమిళంలో హిట్ కొట్టిన 'సీమరాజా'
  • అదే పేరుతో తెలుగులోకి 
  • ఈ నెల 8వ తేదీన విడుదల  
ఇటీవల తమిళంలో విడుదలైన 'సీమరాజా' అక్కడ భారీ వసూళ్లను సాధించింది. శివకార్తికేయన్ సరసన సమంత .. కీర్తి సురేశ్ నాయికలుగా నటించగా,లేడీ విలన్ గా సిమ్రన్ నటించింది. శివకార్తికేయన్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచిన ఈ సినిమాను, అదే టైటిల్ తో తెలుగులో ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను నిర్మాత సాయికృష్ణ తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .." శివకార్తికేయన్ .. సమంత .. కీర్తి సురేశ్ పాత్రలు సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇక సిమ్రన్ పండించే విలనిజం తెరపై చూసితీరవలసిందే. 'ఒరేయ్ నేను చీరకట్టిన మగాడినిరా' అంటూ ఆమె డైలాగ్ వుంటుందంటే ఆ విలనిజం ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి సిమ్రన్ పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. ఎక్కడా తమిళ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చారు. 
shivakarthikeyan
samanta
keerthi suresh

More Telugu News